Share News

సాత్విక్‌ జోడీ అవుట్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:56 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్స నుంచి భారత ఏస్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి తప్పుకొన్నారు....

సాత్విక్‌ జోడీ అవుట్‌

గాయంతో వైదొలగిన భారత జంట

బరిలో సింధు, లక్ష్యసేన్‌

నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌

నింగ్‌బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్స నుంచి భారత ఏస్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి తప్పుకొన్నారు. సాత్విక్‌ భుజం నొప్పితో బాధపడుతున్నట్టు కోచ్‌ తెలిపాడు. కాగా, ఆల్‌ ఇంగ్లండ్‌ ఫైనల్లో ఓడిన లక్ష్యసేన్‌.. మంగళవారం నుంచి జరిగే టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు. మహిళల్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, మాళవిక బన్సోడ్‌ బరిలో నిలవనున్నారు. పురుషుల్లో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, కిడాంబి శ్రీకాంత్‌, ఆయుష్‌ శెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో హరిహరన్‌-ఎంఆర్‌ అర్జున్‌, కృష్ణమూర్తి రాయ్‌-సాయి ప్రతీక్‌, ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌, అశ్విని-శిఖా గౌతమ్‌, ప్రియ-శ్రుతి, మిక్స్‌డ్‌లో రోహన్‌ కపూర్‌-రుత్విక శివాని, ధ్రువ్‌ కపిల-తనీషా క్రాస్టో జోడీలు ఆడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

Updated Date - Apr 07 , 2026 | 02:56 AM