బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు అవసరం: హర్మన్‌ప్రీత్ కౌర్
ABN , Publish Date - Jun 22 , 2026 | 08:12 AM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై సునాయసంగా గెలిచేసిన టీమిండియాకు.. సౌతాఫ్రికా చేతిలో పరాభవం ఎదురైంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై సునాయసంగా గెలిచేసిన టీమిండియాకు.. సౌతాఫ్రికా చేతిలో పరాభవం ఎదురైంది. మరిజేన్ కాప్(81*) విధ్వంసానికి భారత్.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. శ్రీచరణి(3/24), షఫాలీ వర్మ(1/22) బౌలింగ్‌లో రాణించినప్పటీ.. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది.
‘మేం సులువుగా గెలిచేస్తామనే అనుకున్నాం. మేం నిర్దేశించిన లక్ష్యాన్ని కాపాడుకోవచ్చని భావించాం. శ్రీచరణి, షఫాలీ అద్భతుంగా రాణించారు. సఫారీ బ్యాటర్లకు సవాల్ విసిరారు. కానీ ఫీల్డర్ల నుంచి వారిని సరైన మద్దతు దొరకలేదు. బౌలర్లకు ఫీల్డర్ల నుంచి మద్దతు అవసరం. ఈ మ్యాచ్‌లో సులువైన క్యాచ్‌లు వదిలేశాం. చేజేతులా గెలిచే అవకాశాలను వదులుకున్నాం. కాప్ అద్భుతంగా ఆడింది. మా నుంచి మ్యాచ్‌ను దూరం చేసింది. క్యాచ్‌లను వదిలేయడం వల్లే మ్యాచ్ చేజారింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాజిటివ్‌గానే ముందుకు సాగుతాం’ అని హర్మన్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...