వైభవ్‌ను ఆదర్శంగా తీసుకోండి.. యువ మహిళా ప్లేయర్లకు హర్మన్‌ప్రీత్ కౌర్ సూచన
ABN , Publish Date - Nov 13 , 2026 | 08:51 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆదర్శంగా తీసుకుని నిర్భయంగా, దూకుడుగా క్రికెట్ ఆడాలని యువ మహిళా ప్లేయర్లకు సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ మహిళా క్రికెటర్లకు టీమిండియా స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ ఆసక్తికరమైన సందేశం ఇచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆదర్శంగా తీసుకుని నిర్భయంగా, దూకుడుగా క్రికెట్ ఆడాలని సూచించింది. వైభవ్ ఆటతీరు యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని.. ముఖ్యంగా అమ్మాయిలు కూడా అదే తరహాలో దూకుడైన ఆటతో మహిళల క్రికెట్ రూపురేఖలను మార్చాలని ఆకాంక్షించింది. శుక్రవారం జైపూర్‌లో తన మైనపు విగ్రహావిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
‘వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. అతడి ఆటతీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. కొత్తగా వస్తున్న అమ్మాయిలు కూడా ఇలాగే దూకుడుగా క్రికెట్ ఆడతారని ఆశిస్తున్నాను. వైభవ్‌ను ఆదర్శంగా తీసుకోండి. ధైర్యంగా బ్యాటింగ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ రూపాన్ని మార్చేలా యువ మహిళా ప్లేయర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాలి. మహిళల క్రికెట్‌లోనూ మరింత దూకుడైన ఆటతీరు అవసరం’ అని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!