అప్పుడు హార్దిక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు: ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె
ABN , Publish Date - May 23 , 2026 | 08:34 PM
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య మైదానంలోనే తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండ్య ఎందుకు అలా ప్రవర్తించాడనే విషయంపై ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య మైదానంలోనే తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అతడి బౌలింగ్‌లో రాబిన్ మింజ్, దీపక్ చాహర్ కీలక క్యాచ్‌ను జారవిడవడంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్.. స్టంప్స్‌ను బలంగా కొట్టేశాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటన కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన పాండ్యపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌పై పాండ్య ఎందుకు అలా ప్రవర్తించాడనే విషయంపై ఎంఐ కోచ్ మహేలా జయవర్ధనె స్పందించాడు.
‘ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. కేకేఆర్‌పై మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య చాలా నిరాశకు గురయ్యాడు. వరుస ఓటములు, గాయాలు అతడిపై తీవ్ర ప్రభావం చూపాయి. అలాంటి పరిస్థితుల్లో ఏ ప్లేయర్‌కైనా లేదా కెప్టెన్‌కు అయినా నిరాశ సహజమే. దాన్ని మరీ పెద్దగా చేసి చూస్తున్నారు. కేవలం హార్దిక్ ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సీజన్ కలిసి రాలేదు. బలమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. మైదానంలో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాం’ అని జయవర్ధనె వెల్లడించాడు.
కాగా కేకేఆర్ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు హార్దిక్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్.. చివరి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను సానుకూలంగా ముగించాలని చూస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు మాత్రం ఇది అత్యంత కీలక మ్యాచ్. విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: లఖ్‌నవూతో కీలక పోరు.. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్
అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?