ఐపీఎల్ 2026: గిల్, బట్లర్, సుందర్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 211
ABN , Publish Date - Apr 08 , 2026 | 09:26 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(12) మినహా టాపార్డర్ బ్యాటర్లు అందరూ చెలరేగి ఆడారు. వరుసగా హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(70; 45 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లు), జోస్ బట్లర్(52; 27 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్(55; 32 బంతుల్లో 2 సిక్స్‌లు, 6 ఫోర్లు)తో బీభత్సం సృష్టించారు.
గ్లెన్ ఫిలిప్స్(14*), రాహుల్ తెవాటియా(1*) నాటౌట్‌గా నిలిచారు. జీటీ బ్యాటర్ల విధ్వంసానికి ఢిల్లీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ కుమార్ తన ఓవర్ కోటాలో ఏకంగా 55 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు తీశాడు. ఎంగిడి 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య