తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టమైన పని: గంభీర్
ABN , Publish Date - Jun 05 , 2026 | 09:28 PM
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు శనివారం నుంచి భారత్‌లో పర్యటించనుంది. ముల్లాన్‌పూర్ వేదికగా ఏకైక టెస్టులో భారత్‌తో తలపడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు శనివారం నుంచి భారత్‌లో పర్యటించనుంది. ముల్లాన్‌పూర్ వేదికగా ఏకైక టెస్టులో భారత్‌తో తలపడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టమైన పని అని తెలిపాడు.
‘తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టమైన పని. జట్టులో ప్రతిభ ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. వీరిలోంచి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం అత్యంత కష్టమైన పని. అందుకే ఏ కోచ్‌కైనా, టీమ్ మేనేజ్‌మెంట్‌కైనా.. ఏ ఫార్మాట్లో అయినా సరే.. తుది జట్టును ఎంచుకోవడం కఠినం. ఇది భారత క్రికెట్ గొప్పతనం. అయితే టెస్టు క్రికెట్ మాత్రం కాస్త భిన్నం. ఈ ఫార్మాట్‌లో రాణించాలంటే మెలకువలు, టెక్నిక్ మాత్రమే సరిపోవు. ఒత్తిడిని తట్టుకోగలగాలి. ఆటను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు త్యాగాలు కూడా చేయాల్సి వస్తుంది. విజయవంతమైన టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇవన్నీ చేయడం అత్యవసరం. మేం యువ క్రికెటర్లతో కూడా ఇదే విషయం గురించి మాట్లాడాం. జట్టు కోసం త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. అప్పుడే టెస్టుల్లో విజయవంతమైన జట్టు రూపొందుతుంది’ అని గంభీర్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!
మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!