టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!
ABN , Publish Date - Aug 28 , 2026 | 05:36 PM
శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభినందించాడు. రెండు టెస్టుల్లోనూ చివరి వరకు పోరాడిన భారత ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియాను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభినందించాడు. రెండు టెస్టుల్లోనూ చివరి వరకు పోరాడిన భారత ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ప్రశంసించాడు. రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్లను ఔట్ చేయడంలో విఫలమవ్వడంతో మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపనుంది. ప్లేయర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ప్రధాన కోచ్ గంభీర్ వారిని అభినందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రెండో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత గంభీర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘టెస్టు క్రికెట్‌కు క్యారెక్టర్, సహనం, మానసిక దృఢత్వం చాలా అవసరం. మా ఆటగాళ్లు చివరి వరకు పోరాడి అదే చూపించారు. సోనల్ దినుషాకు ప్రత్యేక అభినందనలు. అతడు అద్భుతంగా ఆడాడు’ అని గంభీర్ పేర్కొన్నాడు.
పోరాడారు కానీ..
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఏకంగా 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఫాలో ఆన్ ఆడించింది. అయితే రెండో ఇన్సింగ్స్‌లో లంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. ముఖ్యంగా దినుషా 133 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు విజయాన్ని దూరం చేశాడు. భారత బ్యాటర్లు తమ పని సరిగ్గానే చేసినప్పటికీ ఫాలో ఆన్‌లో బౌలర్లు మాత్రం తీవ్రంగా విఫలమయ్యారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 429 పరుగులు చేయగలిగింది. దీంతో సిరీస్ డ్రాగా ముగిసింది.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టులో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేది: మహ్మద్ కైఫ్
పడిక్కల్ టాటూ, పంత్ గాయం.. శ్రీలంక టెస్టు ఫొటోలు పంచుకున్న ప్లేయర్లు!