అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:43 PM
క్రికెటర్ అనయ బంగర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెటర్ అనయ బంగర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. లింగ మార్పిడి అనంతరం క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన ఆమెకు.. ఆస్ట్రేలియాలోని కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడే అవకాశం కూడా రావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనయకు అనుమతి లభించినట్లు పేర్కొంటూ వచ్చిన వార్తను మారిజాన్ కాప్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘ఇది పూర్తిగా హాస్యాస్పదం. అనయ బంగర్ క్రికెట్ ఆడేందుకు అసలు అనుమతి ఇవ్వకూడదు!’ అంటూ ఘాటుగా స్పందించింది. ఈ పోస్టులో WBBL అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా ట్యాగ్ చేసింది.
ముంబైతో పాటు ఇంగ్లండ్‌లోనూ క్రికెట్
లింగ మార్పిడికి ముందు అనయ పురుషుల క్రికెట్‌లోనూ ఆడింది. ముంబై తరఫున పలు విభాగాల క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్, అతడి సోదరుడు ముషీర్ ఖాన్‌తో కలిసి ఆడింది. అంతేకాకుండా ఇంగ్లండ్‌లో క్లబ్ క్రికెట్‌లోనూ పాల్గొన్న అనుభవం ఆమెకు ఉంది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వడం.. భవిష్యత్‌లో ఎలైట్ మహిళల క్రికెట్, ముఖ్యంగా WBBLలో ఆమెకు అవకాశం దక్కుతుందా? అనే చర్చకు తెరలేపింది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా స్టార్ మారిజాన్ కాప్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టులో కోహ్లీ ఉంటే ఫలితం మరోలా ఉండేది: మహ్మద్ కైఫ్
పడిక్కల్ టాటూ, పంత్ గాయం.. శ్రీలంక టెస్టు ఫొటోలు పంచుకున్న ప్లేయర్లు!