వైభవ్ నుంచి వాసుదేవ్ ప్రసాద్ వరకు.. భారత క్రికెట్‌కు టాలెంట్ హబ్‌గా బిహార్!
ABN , Publish Date - Jul 24 , 2026 | 09:30 PM
ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్దగా ప్రస్తావనకు రాని రాష్ట్రం బిహార్.. ఇప్పుడు యువ క్రికెటర్లకు చిరునామాగా మారుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై రికార్డులతో మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ పేసర్ వాసుదేవ్ ప్రసాద్ వెలుగులోకి వచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్దగా ప్రస్తావనకు రాని రాష్ట్రం బిహార్.. ఇప్పుడు యువ క్రికెటర్లకు చిరునామాగా మారుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై రికార్డులతో మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ పేసర్ వాసుదేవ్ ప్రసాద్ వెలుగులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ పొందే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ముజఫర్‌పూర్‌కు చెందిన వాసుదేవ్ ప్రసాద్‌ను ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్–క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాలోని ప్రముఖ కోచ్‌లు, పేస్ బౌలర్ల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు.
ఇటీవల జింబాబ్వే పర్యటనలో వైభవ్ సూర్యవంశీకి లభించిన ఆదరణ బిహార్ క్రికెట్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వెలుపల పట్నా, సమస్తిపూర్‌తో పాటు వైభవ్ అమ్మమ్మ ఊరి నుంచి వచ్చిన అభిమానులు అతడిని కలుసుకుని ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన వైభవ్.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో తొలి టీ20లో 15 సంవత్సరాల 118 రోజుల వయసులో 18 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ అర్ధ శతకం నమోదు చేశాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మెరిసిన వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. దీంతో 37 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
బిహార్ నుంచి వరుసగా..
బిహార్ నుంచి ఇప్పటికే పలువురు ఆటగాళ్లు భారత క్రికెట్‌లో తమ ముద్ర వేశారు. వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పట్నాకు చెందినవాడు. ఫాస్ట్ బౌలర్లు ముకేశ్ కుమార్, ఐపీఎల్ నయా సంచలనం సాకిబ్ హుస్సేన్ గోపాల్‌గంజ్‌కు చెందినవారు కాగా.. ఆకాశ్ దీప్ ససారం నుంచి వచ్చాడు. సుపౌల్‌కు చెందిన ఇప్పుడు ఆ జాబితాలో వాసుదేవ్ ప్రసాద్ కూడా చేరాడు. వాసుదేవ్ బిహార్ తరఫున అండర్-16, అండర్-19, అండర్-23 స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించాడు.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్