వెయ్యి కిలోమీటర్లు నడిచి హార్దిక్ మనసు గెలిచిన అభిమాని.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 20 , 2026 | 10:39 AM
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై ఓ అభిమాని చూపిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన అభిమాన క్రికెటర్‌ను కలవాలనే కోరికతో ఓ వ్యక్తి ఏకంగా వెయ్యి కిలోమీటర్లకు పైగా నడిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై ఓ అభిమాని చూపిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన అభిమాన క్రికెటర్‌ను కలవాలనే కోరికతో ఓ వ్యక్తి ఏకంగా వెయ్యి కిలోమీటర్లకు పైగా నడిచాడు. ముంబై నుంచి బెంగళూరుకు చేరుకుని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)లో ఉన్న హార్దిక్‌ను కలిశాడు. అతడి అభిమానానికి ఫిదా అయిన హార్దిక్.. ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, తిరుగు ప్రయాణానికి రైలు టికెట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
లఖ్‌నవూకు చెందిన రవి.. హార్దిక్ పాండ్యకు వీరాభిమాని. ప్రస్తుతం సీఈవోలో చికిత్స పొందుతున్న హార్దిక్‌ను కలవడానికి ముంబై నుంచి బెంగళూరుకు కాలినడకన వచ్చాడు. విషయం తెలుసుకున్న హార్దిక్.. రవిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. ‘నీకు ఏమైనా కావాలా? నీ కోసం నేనేమైనా చేయగలనా?’ అంటూ అభిమాని పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా త్వరలోనే మళ్లీ కలుస్తానని చెప్పాడు. దీంతో హార్దిక్ ఔదార్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం
ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా