రజనీకాంత్‌పై వీరాభిమానం.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ బుక్ చేసిన సంజు శాంసన్
ABN , Publish Date - Oct 20 , 2026 | 08:33 AM
భారత స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని. తన అభిమాన నటుడి తాజా చిత్రం ‘జైలర్-2’ను చూసేందుకు సంజు ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని. తన అభిమాన నటుడి తాజా చిత్రం ‘జైలర్-2’ను చూసేందుకు సంజు ఏకంగా ఓ థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. భార్య, స్నేహితులతో కలిసి సినిమా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
‘నాకు రజనీ సర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తదుపరి సినిమా కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటా. ఈ సారి జైలర్ 2 సినిమా రీలీజ్ అయిన రోజే చూడలేకపోయాను. ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ రోజు చూస్తున్నా. అదృష్టవశాత్తూ మొత్తం థియేటర్‌ను బుక్ చేసుకోగలిగాను. నా స్నేహితులను ఆహ్వానించా. నా భార్య, కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.. రజనీ సర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంతో సంబరపడ్డాను. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు భారత జట్టు సహాయక సిబ్బందిలో తమిళం తెలిసిన వారు కూడా హాజరయ్యారు’ అని సంజు వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
పారా ఆసియా గేమ్స్: అథ్లెటిక్స్‌లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీకి స్వర్ణం
ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా