Share News

ఫిఫా ప్రపంచకప్ 2026 రగడ: పరేడెస్‌పై చర్యలు వద్దన్న ఎరిక్

ABN , Publish Date - Jul 22 , 2026 | 08:34 AM

ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో భౌతిక ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా దాడి చేసిన అర్జెంటీనా ప్లేయర్‌కు స్పెయిన్ స్టార్ మద్దతుగా నిలిచాడు.

ఫిఫా ప్రపంచకప్ 2026 రగడ: పరేడెస్‌పై చర్యలు వద్దన్న ఎరిక్
Eric Garcia

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే అర్జెంటీనా ఆటగాళ్లు ఈ ఘర్షణకు దిగారు. అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్... స్పెయిన్ ఆటగాడు ఎరిక్ గార్సియాపై భౌతిక దాడికి యత్నించాడు. అతడి గొంతు పట్టుకోవడమే కాకుండా, మరొక యువ ఆటగాడు గావిని కిందకు తోసేశాడు. ఈ తీవ్రమైన ప్రవర్తనకు గానూ పరేడెస్‌పై కనీసం మూడు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఫిఫా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదా క్రమశిక్షణా చర్యలను ప్రకటించలేదు.


ఇక తనపై జరిగిన దాడిపై ఎరిక్ గార్సియా స్పందించాడు. అంతేకాక లియాండ్రో పరేడెస్‌కు సపోర్టుగా ఈ సంఘటనపై అత్యంత ఉదారంగా స్పందించాడు. టోర్నీ ముగించుకుని స్వదేశానికి చేరుకున్న అనంతరం స్థానిక మీడియాతో ఎరిక్ మాట్లాడుతూ.. పరేడెస్‌పై నిషేధం విధించకూడదని వ్యాఖ్యానించాడు.


'అతడిపై నిషేధం విధించాలని నేను అనుకోవడం లేదు. ఒక వేళ ఎరిక్‌పై చర్యలు తీసుకుంటే యంగ్ ప్లేయర్లకు మంచి సంకేతం కాకపోవచ్చు. ఫుట్‌బాల్‌లో ఇటువంటి తీవ్రమైన, దూకుడుతో కూడిన కోణం కూడా ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఎరిక్‌కి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తే బాగుండేది. ఏం జరిగినా.. అది కేవలం ఒక ఆట మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఇలాంటి హద్దులు, సరిహద్దులు ఆట వరకే పరిమితం కావాలి' అని ఎరిక్ స్పష్టం చేశాడు. పరేడెస్‌పై క్రమశిక్షణా చర్యల కత్తి వేలాడుతున్న వేళ, బాధితుడైనఈ స్పెయిన్ స్టార్ చేసిన వ్యాఖ్యలకు క్రీడా అభిమానులు ఫిదా అవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచం ముందు విలన్‌గా అర్జెంటీనా! ఎందుకంటే..

పతక జోరు కష్టమేనా?

Updated Date - Jul 22 , 2026 | 09:55 AM