Share News

దులీప్ ట్రోఫీ ఫైనల్: విధ్వంసం.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

ABN , Publish Date - Sep 07 , 2026 | 02:37 PM

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. సౌత్ జోన్‌పై మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు. 301 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 250 పరుగులు చేశాడు.

దులీప్ ట్రోఫీ ఫైనల్: విధ్వంసం.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
Ishan Kishan

ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. సౌత్ జోన్‌పై మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు. 301 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 250 పరుగులు చేశాడు. నిరంతరాయంగా బ్యాటింగ్ చేస్తున్న కారణంగా రెండో రోజు కాస్త అసౌకర్యానికి గురై రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 131 ఓవర్లకు ఈస్ట్ జోన్ స్కోర్ 614/5.


ఓవర్ నైట్ 385/4 స్కోరుతో ఈస్ట్ జోన్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. కుమార్ కుషాగ్రా (101) సెంచరీ చేసి ఔటయ్యాడు. ఇషాన్-కుషాగ్రా కలిసి ఐదో వికెట్‌కు 230 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అనుకుల్ రాయ్(41*) ఇషాన్‌తో అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ కలిసి 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో క్రీజులోకి కురేషి(6*) వచ్చాడు. ఇదిలా ఉంటే, సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, సీవీ మిలింద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!

ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?

Updated Date - Sep 07 , 2026 | 02:38 PM