Share News

దులీప్ ట్రోఫీ: వికెట్లు తీసిన వైభవ్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్ జట్టు

ABN , Publish Date - Aug 25 , 2026 | 09:14 PM

దులీప్ ట్రోఫీ 2026లో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

దులీప్ ట్రోఫీ: వికెట్లు తీసిన వైభవ్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్ జట్టు
Duleep Trophy 2026

ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీ 2026లో ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యంశీ(8), కెప్టెన్ ఇషాన్ కిషన్(4) విఫలమైనప్పటికీ.. సుదీప్ కుమార్(146), షాబాజ్ అహ్మద్(167) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఈస్ట్ జోన్ జట్టు 467 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.


తొలి ఇన్నింగ్స్‌లో అభిజిత్ సర్కార్ 5, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లతో చెలరేగడంతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. అర్పిత్ సుభాష్(32) టాప్ స్కోరర్. ఫాలో ఆన్‌లో నార్త్ ఈస్ట్ జోన్ జట్టు 146 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో నిరాశపరిచినప్పటికీ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌లో రాణించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదిలా ఉంటే, ఆగస్టు 30 నుంచి తొలి సెమీ ఫైనల్‌లో సెంట్రల్ జోన్‌తో ఈస్ట్ జోన్ జట్టు తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట

అంపైర్లతో గొడవ.. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు

Updated Date - Aug 25 , 2026 | 09:15 PM