ట్రీసా-గాయత్రి జోడీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 08:22 PM
భారత స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్లేయర్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలు మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్లేయర్లు గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలు మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో ట్రీసా-గాయత్రి కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వారిని అభినందించారు.
అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి పతకం సాధించినందుకు ట్రీసా, గాయత్రిలను ప్రశంసించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల భవిష్యత్ ప్రస్థానానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు, దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి పి.వి.వి. లక్ష్మి పాల్గొన్నారు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా సీఎంతో పలు అంశాలపై చర్చించారు.
ట్రీసా-గాయత్రి రికార్డు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి-ట్రీసా జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీ ఫైనల్‌లో చైనా జోడీపై ఓటమి పాలవ్వడంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2011 తర్వాత పతకం గెలిచిన తొలి జట్టుగా ట్రీసా-గాయత్రి రికార్డు నెలకొల్పారు.
ఇవి కూడా చదవండి:
భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట
అంపైర్లతో గొడవ.. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు