Share News

శ్రీలంకను తక్కువగా అంచనా వేయొద్దు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టండి: గంభీర్

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:34 PM

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పలు కీలక సూచనలు చేశాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని తెలిపాడు.

శ్రీలంకను తక్కువగా అంచనా వేయొద్దు.. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టండి: గంభీర్
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పలు కీలక సూచనలు చేశాడు. డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 13 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచి సిద్ధం కావాలని ప్లేయర్లకు గంభీర్ సూచించాడు. నెల రోజుల విరామం ఉన్నప్పటికీ సమయం వృథా చేసుకోకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని చెప్పాడు.


‘న్యూజిలాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. మీరు తలెత్తుకుని స్వదేశానికి వెళ్లొచ్చు. చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలని అనుకున్నాం. కానీ కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. మనం ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడటం లేదు. ఇప్పుడు నెల రోజుల విరామం ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి. శ్రీలంక సిరీస్ కోసం బాగా సిద్ధం కావాలి. ఏ ప్రత్యర్థినీ తక్కువ అంచనా వేయకూడదు. జట్టుగా నిరంతరం ఎదుగుతూ ఉండాలి. జట్టుగా ఆలోచించాలి. జట్టుగానే ఆడాలి. విజయాలు అవే వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఫిట్‌నెస్‌ను కాపాడుకోండి’ అని గంభీర్ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

కివీస్ సిరీస్‌కు భువీని ఎంపిక చేయడమే సెలెక్టర్లు చేసిన తప్పు: ఇర్ఫాన్ పఠాన్

సంజునే నా ఫస్ట్ ఛాయిస్.. అభిమానికి అశ్విన్ అదిరిపోయే కౌంటర్!

Updated Date - Nov 02 , 2026 | 01:35 PM