Share News

రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:36 PM

టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.7.18 కోట్లు.

రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య
Devisha Shetty

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.7.18 కోట్లు. ముంబైలోని ఓ ప్రముఖ కంపెనీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఇదే ప్రాజెక్టులో సూర్యకుమార్-దేవిశా శెట్టి దంపతులు రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు.


2025లో 17, 18వ అంతస్తుల్లో రెండు ఫ్లాట్లు సొంతం చేసుకున్న దేవిశా శెట్టి.. తాజాగా 18వ అంతస్తులోనే మరో ఫ్లాట్‌ను కూడా దక్కించుకున్నారు. ఈ ఫ్లాట్‌ను ఫిబ్రవరి 20న రిజిస్ట్రేషన్ చేయించారు. స్టాంప్ డ్యూటీగా రూ.35.90 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.30 వేలు చెల్లించినట్లు సమాచారం. రెండు కార్ పార్కింగ్ స్థలాలతో కూడిన ఈ ఫ్లాట్ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా, ప్రస్తుతం సూర్యకుమార్ టీ20 ప్రపంచ కప్‌లో బిజీగా ఉన్నాడు. గ్రూప్ దశలో టీమిండియా నాలుగు మ్యాచ్‌ల్లో గెలచి అజేయంగా సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సూపర్-8లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది.


ఇవి కూడా చదవండి:

ఓడినా.. ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే ప్లేయర్లు

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?

Updated Date - Feb 24 , 2026 | 05:47 PM