Share News

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఆసియాలోనే టాప్ ప్లేయర్‌గా స్మృతి మంధాన

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:39 PM

భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఫార్మాట్లతో సంబంధం లేకుండా పరుగుల ప్రవాహం కొనసాగిస్తోంది. లేడీ విరాట్‌గా పేరొందిన ఈ స్టార్... ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో సత్తా చాటింది.

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఆసియాలోనే టాప్ ప్లేయర్‌గా స్మృతి మంధాన
Smriti Mandhana

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పరుగుల ప్రవాహం కొనసాగుతోంది. లేడీ విరాట్‌ పేరొందిన ఈ స్టార్.. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో సత్తా చాటింది. ఇవాళ(మంగళవారం) బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో అర్ధ శతకం చేసింది. ఈ మ్యాచ్‌లో మంధాన 68 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసింది.


ఈ అర్ధ సెంచరీతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 11 సార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు చేసిన అతికొద్ది మందిలో ఒకరిగా స్మృతి మంధాన నిలిచింది. ఆసియా ప్లేయర్ల వరకు తీసుకుంటే మంధాననే కంగారూలపై అత్యధిక వన్డే అర్ధ శతకాలు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ కంటే ముందు ఆసీస్‌తోనే జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీతో మెరిసింది. తాజాగా.. అదే జట్టుతో తొలి వన్డేలో చేసిన అర్ధ శతకంతో మంధాన ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది.


ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ప్రతీకా రావల్ డకౌట్‌గా వెనుదిరిగింది. మరో ఒపెనర్ స్మృతి మంధాన మాత్రం ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. 58 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి పెవిలియన్ చేరింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్(84 బంతుల్లో 53) కూడా అర్ధ సెంచరీతో రాణించింది. కశ్వే గౌతమ్ 43, రిచా ఘోష్ 23 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.


టీమిండియా 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ 3, మెగాన్‌ షట్‌ 2 వికెట్లు సాధించారు. డార్సీ బ్రౌన్‌, అలానా కింగ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌, సోఫియా తలో వికెట్‌ తీశారు. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.


ఇవి కూడా చదవండి:

జింబాబ్వేపై వెస్టిండీస్ గెలుపు.. టీమిండియాకు కష్టాలు!

నేడు ఇంగ్లండ్‌తో మ్యాచ్.. పాక్‌ను భయపెడుతున్న వాన!

Updated Date - Feb 24 , 2026 | 03:27 PM