Share News

కరోనా ముగిసి ఇన్నేళ్లు గడిచినా ఉమ్మిపై నిషేధమా?: గిల్

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:40 AM

బంతికి మెరుపు తెచ్చేందుకు ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ‌మన్ గిల్ డిమాండ్ చేశాడు. కరోనా ముగిసి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఇంకా ఆ నిషేధం కొనసాగించడం సరైంది కాదని అతను అభిప్రాయపడ్డాడు.

కరోనా ముగిసి ఇన్నేళ్లు గడిచినా ఉమ్మిపై నిషేధమా?: గిల్

ఇంటర్నెట్ డెస్క్: బంతికి మెరుపు తెచ్చేందుకు ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ‌మన్ గిల్ డిమాండ్ చేశాడు. కరోనా ముగిసి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఇంకా ఆ నిషేధం కొనసాగించడం సరైంది కాదని అతను అభిప్రాయపడ్డాడు. ఆ నిషేధం ఇంకా ఎందుకు కొనసాగుతోందో తనకు అర్థం కావడం లేదని గిల్ అన్నాడు. న్యూజిల్యాండ్‌-భారత్ మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ గిల్ ఆ వ్యాఖ్యలు చేశాడు. న్యూజిల్యాండ్‌తో ఆ టెస్టులో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 720 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. ఆఖరి రోజు న్యూజిలాండ్ ఓవర్లన్నీ ఆడేసి 239 పరుగులకు 5 వికెట్లే కోల్పోయి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంతికి లాలాజలం రాయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని గిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా.. నిరుడు ఐపీఎల్‌లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.


బంతికి ఉమ్మి రాయకుండా 2020 కరోనా మహమ్మారి సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ నిషేధాన్ని తాత్కాలికంగా అమల్లోకి తెచ్చింది. రెండేళ్ల తర్వాత ఆ నిషేధాన్ని శాశ్వతం చేసింది. ప్రస్తుతానికి ఆ నిషేధాన్ని ఎత్తేసే ఆలోచన ఐసీసీకి లేనట్లు తెలుస్తోంది. స్వీట్లు, బబుల్ గమ్, మింట్ వంటి పదార్థాలు తింటూ బంతికి ఉమ్మి రాస్తే, అది బంతిపై ప్రభావం చూపుతుందని, అలాంటి పనులు కరెక్టు కావని ఐసీసీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో నిషేధం ఎత్తివేయడానికి తగిన కారణాలు కనిపించడం లేదని ఐసీసీ చెబుతోంది.


ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 11:40 AM