Share News

అల్కారజ్‌ అరుదైన ఘనత

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:43 AM

టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ గెలిచి అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్‌ ముగింపు టోర్నీ తుదిపోరులో అల్కారజ్‌ 6-2, 7-6 (7)తో ప్రపంచ నెంబర్‌వన్‌..

అల్కారజ్‌ అరుదైన ఘనత

ట్యూరిన్‌ (ఇటలీ): టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ గెలిచి అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్‌ ముగింపు టోర్నీ తుదిపోరులో అల్కారజ్‌ 6-2, 7-6 (7)తో ప్రపంచ నెంబర్‌వన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను ఓడిం చి తొలిసారి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో.. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లైన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లతో పాటు ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగో ఆటగాడిగా 23 ఏళ్ల అల్కారజ్‌ రికార్డులకెక్కాడు. గతంలో అండ్రీ అగస్సీ, రోజర్‌ ఫెడరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌ మాత్రమే ఈ ఫీట్‌ సాధించారు. కాగా, ఏపీటీ ఫైనల్స్‌లో టైటిల్‌ నెగ్గకపోయినా, జ్వెరెవ్‌ ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంకులో మాత్రం మార్పు లేకపోవడం విశేషం. అల్కారజ్‌ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Updated Date - Nov 24 , 2026 | 02:47 AM