గెలిస్తేనే సెమీస్‌కు..
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:37 AM
అండర్-19 ఆసియాక్‌పలో భారత కుర్రాళ్లు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. ఆదివారం పాకిస్థాన్ చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు...
ఉ.10.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
భారత కుర్రాళ్లపై ఒత్తిడి
నేడు యూఏఈతో మ్యాచ్
అండర్-19 ఆసియాకప్
ఒమన్: అండర్-19 ఆసియాక్‌పలో భారత కుర్రాళ్లు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నారు. ఆదివారం పాకిస్థాన్ చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈనేపథ్యంలో మంగళవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా యూఏఈతో తలపడనుంది. ప్రస్తుతం ఇరు జట్లు రెండు పాయింట్లతో ఉండగా.. గెలిచిన జట్టు సెమీస్‌కు వెళుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై అదరగొట్టిన యువ భారత జట్టు పాక్‌పై మాత్రం అన్ని విభాగాల్లో తేలిపోయింది. అర్జున్ రాజ్‌పుత్ (107) సెంచరీ కారణంగా 208 పరుగులు చేయగలిగింది. అయితే బౌలింగ్ విభాగం మాత్రం అండగా ఉంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి
దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు