Share News

ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ!

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:26 PM

ఈజిప్టులో ఆదివారం రైలు ప్రమాదం సంభవించింది. ఒక రైలును మరో రైలు వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ!
Passenger Trains collide in Egypt

ఇంటర్నెట్ డెస్క్: ఈజిప్టులో ఆదివారం రైలు ప్రమాదం సంభవించింది. ఒక రైలును మరో రైలు వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు మరణించగా 88 మంది గాయాల పాలయ్యారు. పలు బోగీలు పట్టాలు తప్పాయి. గిజా ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది.

కైరో నుంచి ఆస్వాన్‌కు వెళుతున్న రైలును గిజా నుంచి ఫయోమ్‌కు వెళుతున్న రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది క్షతగాత్రులను కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.


ఈ ఘటనపై అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీ సీరియస్ అయ్యారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అక్కడి రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ప్రమాదం కారణంగా కైరో-అప్పర్ ఈజిప్టు లైన్లో నిలిచిపోయిన రైలు సేవలు ఎప్పటికి పునరుద్ధరిస్తారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

ఇటీవల స్పెయిన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 69 మంది మరణించిన విషయం తెలిసిందే. రైళ్ల రాకపోకలను గమనించే కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రైల్వే లైన్ అప్‌గ్రేడ్‌కు ఉద్దేశించిన నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఈయూ దర్యాప్తు ప్రారంభించింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం.. ఇజ్రాయెల్‌లో పతాకస్థాయికి ఉత్కంఠ!

సౌదీపై హూతీల దాడులు.. ఆరాంకో చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయమే లక్ష్యం..

Updated Date - Nov 08 , 2026 | 09:49 PM