Share News

34 ఏళ్ల టెస్టు చరిత్రలో అతిపెద్ద ఘనత.. బంగ్లాను చిత్తు చేసిన జింబాబ్వే

ABN , Publish Date - Jun 30 , 2026 | 09:30 PM

జింబాబ్వే క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

34 ఏళ్ల టెస్టు చరిత్రలో అతిపెద్ద ఘనత.. బంగ్లాను చిత్తు చేసిన జింబాబ్వే
Zimbabwe vs Bangladesh

స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వే క్రికెట్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ 85 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 1992లో టెస్టు హోదా పొందిన జింబాబ్వేకు 34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇదే అత్యంత భారీ టెస్టు విజయం కావడం విశేషం. తాత్కాలిక కెప్టెన్ రిచర్డ్ న్గరవా సారథ్యంలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి బంగ్లాదేశ్‌ను బెంబేలెత్తించింది. గత మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన జింబాబ్వే, ఇప్పుడు వరుసగా రెండో ఆసియా దేశంపై ఇన్నింగ్స్ విజయాన్ని అందుకొని సత్తా చాటింది. పాతికేళ్ల తర్వాత జింబాబ్వే వరుసగా రెండు టెస్టులు గెలవడం ఇదే తొలిసారి.


మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. తొలి రోజే జింబాబ్వే పేస్ దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. న్యుమన్ న్యామ్‌హురి (4/61) బంగ్లాను దెబ్బతీశాడు. అనంతరం జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇన్నోసెంట్ కాయా (140) అద్భుత సెంచరీతో పాటు బ్రయాన్ బెన్నెట్ (59), క్రెయిగ్ ఎర్విన్ (60), వెస్లీ మాధెవెరె (77) ల హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో 410 పరుగుల భారీ స్కోరు సాధించిన జింబాబ్వే 270 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 7 వికెట్లు పడగొట్టినా లాభం లేకపోయింది.


రెండో ఇన్నింగ్స్‌లో 230 పరుగులు వెనుకబడి, మూడో రోజు ఆటను 40/1 ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించిన బంగ్లాదేశ్.. జింబాబ్వే బౌలర్ల ధాటికి 185 పరుగులకే ఆలౌటైంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ (4/65), కెప్టెన్ రిచర్డ్ న్గరవా (3/32) అద్భుత స్పెల్స్‌తో బంగ్లా పతనాన్ని శాసించారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (34), కెప్టెన్ శాంటో (30) మాత్రమే కాసేపు నిలబడగలిగారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇన్నోసెంట్ కాయాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.


ఇవి కూడా చదవండి:

హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!

టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి

Updated Date - Jun 30 , 2026 | 09:32 PM