టీమిండియా నిష్క్రమించినా.. అగ్రస్థానంలోనే శ్రీ చరణి
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:49 PM
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో ఆమె నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్2026లో భారత జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించినప్పటికీ, టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇవాళ(మంగళవారం) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో ఆమె నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో శ్రీ చరణి 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లు ఆడుతున్న ఇంగ్లండ్ బౌలర్లు సోఫీ ఎకిల్‌స్టోన్ ఒక స్థానం ఎగబాకి 3వ స్థానం, లారెన్ బెల్ మూడు స్థానాలు మెరుగై 4వ ర్యాంక్‌కు చేరుకుని శ్రీ చరణి టాప్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారు. సౌతాఫ్రికా స్పిన్నర్ నాన్కులులేకో మ్లాబా 5వ స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ తన ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఆమె అగ్రస్థానంలోనే నిలిచింది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ ఒక స్థానం మెరుగై సంయుక్తంగా మూడో ర్యాంకుకు చేరుకోగా.. ఐర్లాండ్‌పై అజేయ సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు రెండు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్ సాధించింది. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్‌గా ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్ డాని వ్యాట్ హాడ్జ్ ఐదు స్థానాలు మెరుగై 11వ ర్యాంకుకు చేరుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకోగా, న్యూజిలాండ్ క్రీడాకారిణి మెలీ కెర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్ రెండు స్థానాలు మెరుగై సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
బిడ్డ మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ వరల్డ్ కప్‌లో గోల్
బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!