Share News

డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:45 PM

డెలివరీ బాయ్‌తో వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు.

డెలివరీ బాయ్‌తో వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్
Akhil Raj Raju Weds Rambai

హైదరాబాద్, జూన్ 30: డెలివరీ బాయ్‌తో వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వివాదంపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ‘నిన్న మధ్యాహ్నం నుంచి ఓ వీడియో సర్క్యులేట్ అవుతోంది. కొండాపూర్ జోన్‌లో ఓ డెలివరీ అబ్బాయి మా ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోని ఫ్లాట్‌ నంబర్ 201లో ఇవ్వాల్సిన పార్సిల్‌ను మా ఇంటికి తెచ్చి ఇచ్చాడు. మా నాన్న పార్సిల్ తీసుకున్నాడు. మా ఇంట్లో ఎవరో ఆర్డర్ చేశారనుకుని మా అమ్మ దాన్ని ఓపెన్ చేసింది’..


‘ఇంట్లో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసి పక్కన పెట్టేసింది. 20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు. ఆ అబ్బాయికి ఇవ్వడానికే ఆ పార్సిల్ పక్కన పెట్టాం. అతడు రాగానే ‘బ్రదర్ మీరు అడ్రస్ క్రాస్ చెక్ చేసుకోలేదా?’ అని అడిగాను. అతడు తాగేసి ఉన్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఇంతలో మా అమ్మ ఓపెన్ చేసిన పార్సిల్‌ను తీసుకువచ్చింది. ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అని దారుణమైన మాటలు మాట్లాడాడు. మా అమ్మను అన్నందుకు నాకు కోపం వచ్చింది. ఆ అబ్బాయిని ఏమైనా అంటే నాకేంటి లాభం. నేను కూడా డెలివరీ బాయ్‌గా పని చేశాను’..


‘ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఎదురు ఫ్లాట్‌లో ఉన్న వారు చేసిన పని కారణంగానే ఇదంతా జరిగింది. వాళ్లు మా ఇంటి అడ్రస్ పెడుతున్నారు. గతంలో సిగరెట్లు, ఇతర వస్తువులు మా ఇంటికి వచ్చాయి. సోషల్ మీడియాలో నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మీ ఇంట్లో వాళ్లను నెగిటివ్‌గా మాట్లాడితే మీరేం చేస్తారు. నేను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. మేము తప్పు చేసి ఉంటే క్షమించండి’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

కడప స్టీల్ ప్లాంట్ పనులకు ముహూర్తం ఫిక్స్

వికాసిత్ భారత్ లక్ష్యంలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Updated Date - Jun 30 , 2026 | 06:11 PM