బండి సంజయ్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:11 PM
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.
హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ.25 వేల వరకు ఇస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. అలాగే ఓటర్లకు రూ.5 వేల చొప్పున ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు పంచుకుంటున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ పోలీసులు బండి సంజయ్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 171సీ, 505(2)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123(3ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Also Read:
కడప స్టీల్ ప్లాంట్ పనులకు ముహూర్తం ఫిక్స్
పారిశ్రామిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్: మంత్రి టీజీ భరత్