జైస్వాల్, యశ్ శతకాలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:05 AM
యశస్వి జైస్వాల్ (162 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 నాటౌట్), యశ్ రాథోడ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్-ఎతో రెండో అనధికార టెస్ట్‌ను భారత్-ఎ డ్రాగా ముగించింది.
భారత్-ఎ, కివీస్-ఎ మ్యాచ్ డ్రాఫ రెండో అనధికార టెస్ట్
క్రైస్ట్‌చర్చ్: యశస్వి జైస్వాల్ (162 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 నాటౌట్), యశ్ రాథోడ్ (101 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్-ఎతో రెండో అనధికార టెస్ట్‌ను భారత్-ఎ డ్రాగా ముగించింది. ఆటకు చివరి రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 32/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్-ఎ 2 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఫలితం వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లూ డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ 346, న్యూజిలాండ్-ఎ 424 పరుగులు చేశాయి. మూడో, ఆఖరి అనధికార టెస్ట్ శనివారం నుంచి జరగనుంది.
ఇవి కూడా చదవండి:
14 బంతుల్లో 50 ప్రేమా రావత్ రికార్డు
క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ వీడ్కోలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News