Share News

ప్రత్యర్థుల ఆటను ముగించడానికి ఒక్క బిహారీ చాలు: కోహ్లీ

ABN , Publish Date - Jun 03 , 2026 | 08:31 PM

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా వైభవ్, కోహ్లీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పంచుకుంది.

ప్రత్యర్థుల ఆటను ముగించడానికి ఒక్క బిహారీ చాలు: కోహ్లీ
Vaibhav Suryavanshi IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి ఆరెంజ్ తో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాక అతడి విధ్వంసకర బ్యాటింగ్‌పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన తుదిపోరును ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి ఈ 15 ఏళ్ల బుడ్డోడు వీక్షించాడు. ఫైనల్‌లో ఆర్సీబీ గెలిచిన అనంతరం వైభవ్ సూర్యవంశీతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాట్లాడి పలు సూచనలు చేశాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.


బయట ఏం మాట్లాడుతున్నారన్న విషయం పట్టించుకోకుండా ముందుకు సాగాలని వైభవ్‌‌కు కోహ్లీ సూచించాడు. ‘నువ్వు ఇక్కడి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. ఇప్పటివరకు నువ్వు సాధించినదంతా నీ కృషి, శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే సాధ్యమైంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క బిహారీ చాలు అందరిపై పైచేయి సాధించి, ప్రత్యర్థుల ఆట ముగించడానికి’ అని సూర్యవంశీతో విరాట్ కోహ్లీ అన్నాడు. వైభవ్ సూర్యవంశీ బిహార్ రాష్ట్రానికి చెందిన కుర్రాడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే వైభవ్ ను ఉద్దేశిస్తూ ఈ ఒక్క బిహారీ చాలు ప్రత్యర్థులకు భయపెట్టడానికి అని కోహ్లీ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 03 , 2026 | 09:07 PM