ఆ మ్యాచ్‌కే కాకుండా టోర్నీ హైప్ తీసుకురండి: మంధాన
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:13 PM
మరికొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్2026 సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అభిమానులు, మీడియాకు కీలక విజ్ఞప్తి చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: మరికొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్2026 సంగ్రామం జరగనుంది. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో జూన్ 14న బర్మింగ్‌హామ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అభిమానులు, మీడియాకు కీలక విజ్ఞప్తి చేసింది. కేవలం భారత్, పాక్ మ్యాచ్‌కే హైప్ క్రియేట్ చేయొద్దని, ఈ ప్రపంచ కప్ మొత్తానికి ఆదరణ దక్కేలా ప్రచారం చేయాలని కోరింది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టీ20ఐ అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంధాన మాట్లాడారు. ‘ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ టిక్కెట్లన్నీ వేగంగా అమ్ముడయ్యాయి. కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే కాకుండా ఈ టీ20 ప్రపంచ కప్‌నకు కూడా ప్రచారం కల్పించాలని ఆశిస్తున్నాను. కేవలం ఒక మ్యాచ్‌కే మనం ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదు. దానికి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. చాలా మంది క్రికెట్ ప్రియులు ముందుకు వచ్చి మాకు మద్దతు ఇస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. వారి కోసం మేం మంచి ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉంది’’ అని మంధాన పేర్కొంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్-ఎలో ఉన్న భారత్.. లీగ్ దశలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న దక్షిణాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఇక, భారత జట్టు విషయానికొస్తే.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో చేజార్చుకుంది. అంతకుముందు, టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-1 తేడాతో ఓటమి చవిచూసింది.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..