Share News

రేపే నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఏపీలో వానలు

ABN , Publish Date - Jun 03 , 2026 | 03:45 PM

రాబోయే 24 గంటల్లో కేరళంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి.

రేపే నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఏపీలో వానలు
Andhra Pradesh Rain Alert

విశాఖపట్నం, జూన్ 3: నైరుతి రుతుపవనాలు రాబోయే 24 గంటల్లో కేరళంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి. రేపటికి(గురువారం) నైరుతి రుతుపవనాలు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది.


దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కావలిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రాంతంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

పెండింగ్‌‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 03:53 PM