Share News

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:36 PM

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ దంపతులు బృందావ‌నంలోని ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన త‌ర్వాత కోహ్లీ త‌న భార్య అనుష్కా శ‌ర్మతో క‌లిసి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని విజిట్ చేశారు.

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట
Virat Kohli Anushka Sharma spiritual visit

స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్, టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దంపతులు ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందాన్ ఆశ్రమాన్ని విరుష్కా జంట సందర్శించింది. అక్కడ వారిద్దరూ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఇటీవల ఏప్రిల్ 20న అక్షయ తృతీయ సందర్భంగానూ ఈ జంట ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.


ప్రేమానంద్ మ‌హారాజ్‌ ఆశ్రమానికి వెళ్లి బ‌య‌ట‌కు వ‌స్తున్న కోహ్లీ విజువ‌ల్స్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది. ఇద్దరూ చాలా సాదాసీదాగా ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్‌ల‌తో త‌మ ముఖాన్ని క‌వ‌ర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధ‌న‌లు వినేందుకు త‌రుచూ విరుష్కా జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. గ‌త ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్లో గుజ‌రాత్‌ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజ‌యం సాధించింది. ట్రోఫీ గెలిచిన తర్వాత తొలి సారి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. మరోవైపు ట్రోఫీ గెలిచిన అనంతరం జరిగిన ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ దంపతులు డ్యాన్స్ చేశారు.


ఇవి కూడా చదవండి:

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

Updated Date - Jun 02 , 2026 | 04:54 PM