Share News

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లకు వైభవ్ టెన్షన్!

ABN , Publish Date - May 23 , 2026 | 05:17 PM

భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు.. ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్మురేపాడు. ఆ తర్వాత భారత అండర్‌19 జట్టు తరఫున వరల్డ్‌కప్‌ 2025లో సత్తా చాటాడు. తాజాగా..

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌లకు వైభవ్ టెన్షన్!
Vaibhav Suryavanshi World Cup 2027

స్పోర్ట్స్ డెస్క్: వన్డే వరల్డ్‌కప్‌ 2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్‌ జోడీపై టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. దిగ్గజ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ను ఆడిస్తూ.. బ్యాకప్‌ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి.. అఫ్గానిస్థాన్ తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్‌ను వన్డేలకు మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో భారత్‌-ఎ జట్టు తరఫున గనుక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్‌కప్‌ 2027 నేపథ్యంలో వైభవ్‌ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఓ స్పోర్ట్స్ బ్లాగర్‌కు తెలిపారు.


'వైభవ్‌ సూర్యవంశీ త్వరలోనే భారత జట్టులో ఆడబోతున్నాడు. భారత్‌-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. వైభవ్ ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్‌ కొనసాగిస్తే వన్డే వరల్డ్‌కప్‌ 2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ వైభవ్‌ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే.. భారత క్రికెట్‌లో అదొక సంచలనమే అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు 13 ఇన్నింగ్స్‌ల్లో 44.53 సగటుతో, 236కు పైగా స్ట్రైక్ రేట్‌తో 579 పరుగులు సాధించాడు. అతడికి ఈ సీజన్‌లో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన పాటిదార్‌.. అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్..

కృనాల్ పాండ్య బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!

Updated Date - May 23 , 2026 | 05:31 PM