కృనాల్ పాండ్య బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!
ABN , Publish Date - May 23 , 2026 | 12:51 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను లైవ్‌లో చూసిన కావ్య మారన్ షాక్ అయింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆ తర్వాత బంతిని కృనాల్ పాండ్యా అతి వేగంగా బౌన్సర్ వేశాడు. దాంతో కావ్య మారన్ ఒక్కసారిగా షాక్ అయింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నిన్న(శుక్రవారం) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు ప్లేయర్ కృనాల్ పాండ్య బౌలింగ్‌పై ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ అసహనం వ్యక్తం చేసింది. 'ఏంటి.. అతడు త్రో వేశాడు' అన్నట్లు కావ్య హావాభావాలు ఇచ్చింది. కావ్య పక్కనే ఉన్న టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో ఆమె జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ కృనాల్ పాండ్య 17వ ఓవర్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. క్రీజులో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సాధారణంగా స్పిన్ బౌలర్లు స్లో డెలివరీలు లేదా కేరమ్ బాల్స్ వేస్తుంటారు. కానీ కృనాల్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ.. ఒక ఫాస్ట్ బౌలర్ తరహాలో వేగవంతమైన బౌన్సర్ విసిరాడు. ఆ బాల్ కాస్త లైన్ తప్పి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. అయితే పాండ్య వేసిన ఈ ఫాస్ట్ బౌన్సర్ మైదానంలో ఉన్నవారినే కాకుండా స్టాండ్స్‌లో ఉన్న కావ్య పాపను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆ బంతి పడిన వెంటనే కావ్య మారన్ తన సీట్లోంచి వెనక్కి తిరిగి పక్కనే కూర్చున్న టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ వైపు చూసింది. తన చేతులతో బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ.. 'ఆ బాల్ ఏంటి? కృనాల్ స్పిన్ వేయకుండా అలా విసిరేశాడు?' అన్నట్లుగా వెంకటేశ్‌తో కావ్య సంభాషించింది. క్రికెట్ మెళకువలు బాగా తెలిసిన వెంకీ కూడా ఆమె అన్నదానికి స్పందిస్తూ ఆ యాక్షన్ గురించి చర్చించడం లైవ్ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. మొత్తంగా కావ్య మారన్ పదే పదే చేతులు తిప్పుతూ కృనాల్ యాక్షన్‌ను తప్పుబడుతున్నట్లుగా ఇచ్చిన హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌ను అవమానించిన విరాట్ కోహ్లీ !
చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్