టీమిండియా తుది జట్టులోకి 15 ఏళ్ల వైభవ్! కానీ..
ABN , Publish Date - Oct 24 , 2026 | 02:02 PM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కీలక మార్పులతో బరిలోకి దిగింది. చాలాకాలంగా బెంచ్‌కే పరితమైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో స్థానం దక్కింది. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: క్రైస్ట్‌చర్చ్‌లోని హగ్లే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు కీలక మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ ఎంచుకున్నట్లు వెల్లడించాడు. తొలి మ్యాచ్‌లో గాయపడిన వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వడంతో, అతడి స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి రీఎంట్రీ చేశాడు.
15 ఏళ్ల ఈ యువ సంచలనం వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా రెండో మ్యాచ్‌లో నేరుగా నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యరే స్వయంగా వెల్లడించాడు. అలాగే, మరో మార్పు కింద మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ జట్టులోకి వచ్చాడని, ఇది కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమేనని అయ్యర్ తెలిపాడు. మొత్తంగా ఇషాన్ రూపంలో వైభవ్‌కు సువర్ణావకాశం లభించింది. ఈ అవకాశాన్ని అతడు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌లో పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆశలన్నీ ఆవిరై.. పొలంలో బైక్ రైడ్ చేస్తూ వినూత్న నిరసన