సల్మాన్ ఒక్కడే అసలైన టైగర్.. టైగర్ ష్రాఫ్‌పై దాడికి ఈ ప్రశంసే కారణమా..
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:42 PM
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ గతంలో టైగర్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా దాడికి ఒక కారణమని నిందితుల్లో ఒకరు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ గతంలో టైగర్ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా దాడికి ఒక కారణమని నిందితుల్లో ఒకరు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. 2022లో ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో సల్మాన్ ఖాన్‌ను చిత్ర పరిశ్రమలో అసలైన టైగర్‌గా అభివర్ణిస్తూ టైగర్ ష్రాఫ్ మాట్లాడాడని, అందుకే అతడిని టార్గెట్ చేసుకున్నామని నిందితుడు చెప్పినట్లు సమాచారం (Tiger Shroff Attack).
సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలోనే లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వ్యక్తి ఓ ఆడియో సందేశంలో పేర్కొన్నాడు. అక్టోబర్ 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడిన అనంతరం టైగర్ ష్రాఫ్ తన కారులో బయలుదేరుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాల్పుల అనంతరం నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు పలు మార్గాలను ఉపయోగించారు (Lawrence Bishnoi Gang).
ముంబై నుంచి రైలు, ట్యాక్సీ మార్గాల్లో ప్రయాణిస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు (Salman Khan Threat). సూరత్ నుంచి జైపూర్ వైపు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ప్రయాణ మార్గాన్ని గుర్తించడంలో ఒక ట్యాక్సీ డ్రైవర్‌కు చేసిన సాధారణ ఫోన్ కాల్ కీలక ఆధారంగా మారింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమగ్రంగా విచారణ సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..