Share News

75 ఏళ్ల వ్యక్తితో పెళ్లి రద్దు చేసుకున్న రీనా.. నెటిజన్ల ఫైర్

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:37 PM

సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా వాటిని ఆపడం లేదు. వ్యూస్, ఫాలోవర్స్ కోసం రీల్స్ పేరుతో తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ఆ తర్వాత ఇదంతా తప్పు అని స్వయంగా ప్రకటిస్తున్నారు. దీంతో వాళ్లని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

75 ఏళ్ల వ్యక్తితో పెళ్లి రద్దు చేసుకున్న రీనా.. నెటిజన్ల ఫైర్

ఇంటర్నెట్ డెస్క్: సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా వాటిని ఆపడం లేదు. వ్యూస్, ఫాలోవర్స్ కోసం రీల్స్ పేరుతో తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. ఆ తర్వాత ఇదంతా తప్పు అని స్వయంగా ప్రకటిస్తున్నారు. దీంతో వాళ్లని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయ్యలో దాదాపు తాత వయస్సు ఉన్న 75 ఏళ్ల రామ్ సుఘర్‌ని వివాహం చేసుకుంటున్నట్లు 30 ఏళ్ల బ్లాగర్ రీనా రాజ్‌పుత్ ఇటీవల ప్రకటించింది.

అందుకు సంబంధించిన నిశ్చితార్థం వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమెకు 30 ఏళ్లు, సుఘర్‌కు 75 ఏళ్లు. దీంతో 45 ఏళ్ల వయస్సు వత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఈ సందర్భంగా రీనా వ్యాఖ్యానించింది. దీంతో అవి వైరల్ అయ్యాయి.


అయితే ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తాజాగా రీనా రాజ్‌పుత్ వెల్లడించింది. కుటుంబంలో ఘర్షణ కారణంగా వెళ్లిపోయిన భర్త తిరిగి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. భర్తతో దండలు మార్చుకుంటున్న ఓ ఫొటోను రీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదంతా సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం ఆమె చేసిన పనిపై మండిపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాలుగేళ్లకే అద్భుతం.. 3 వేల పుస్తకాలు చదివిన అర్జున్

స్థానిక ఎన్నికలను ఆపేందుకు 59 పిటిషన్లు.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

Updated Date - Oct 24 , 2026 | 01:53 PM