Share News

ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:18 AM

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ బ్యాటర్ తిలక్ వర్మ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఆడిన తొలి 22 బంతుల్లో 19 పరుగులే చేసి.. తర్వాత 23 బంతుల్లోనే 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు
Tilak Varma

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ బ్యాటర్ తిలక్ వర్మ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఆడిన తొలి 22 బంతుల్లో 19 పరుగులే చేసి.. తర్వాత 23 బంతుల్లోనే 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనేక మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఇప్పటి వరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తిలక్‌ను వరించలేదు. అయితే తాజాగా ఐపీఎల్‌ 2026లో తొలిసారి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ను తిలక్ వర్మ అందుకున్నాడు.


మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి తిలక్ మాట్లాడాడు. క్రీజులో కుదురుకోవడానికి ఆరంభంలో నెమ్మదిగా ఆడానని పేర్కొన్నాడు. ఈ ఇన్నింగ్స్‌ కోసం కొత్తగా ఏమీ చేయలేదని, తన సామర్థ్యాలపై నమ్మకం ఉంచి సహజ శైలిలో ఆడినట్లు తెలిపాడు. మొదటి 20 బంతుల్లో ప్రతి బంతికి ఒక్కో పరుగు చేస్తూ క్రీజులో కుదురుకోవడం పైనే దృష్టిసారించానని, క్రీజులో కొంత సమయం గడిపి పిచ్‌ తీరును అర్థం చేసుకున్నానని తెలిపాడు. తన సామర్థ్యాలపై నమ్మకం ఉంచి సహజ శైలిలోనే ఆడినట్లు తిలక్ పేర్కొన్నాడు.


జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ దశలో టీమ్‌కు అసలు ఏం అవసరమో అంచనా వేశానని తెలిపాడు. తన దగ్గర విభిన్నమైన షాట్లు ఉన్నాయని, కానీ ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మన సామర్థ్యాన్ని మనం నమ్మడం చాలా ముఖ్యమని అన్నాడు. గుజరాత్ మ్యాచ్‌లో తాను చేసింది కూడా అదేనని, అందువల్లే ఆశించిన ఫలితం దక్కిందని తిలక్ సంతోషం వ్యక్తం చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. 14 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 103 పరుగుల వద్ద ఉండగా తిలక్ విధ్వంసంతో అనూహ్యంగా ప్రత్యర్థి ఎదుట 200 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో గుజరాత్ 15.5 ఓవర్లలోనే 100 పరుగులకు ఆలౌటైంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు

హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్‌ గురి

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం

Updated Date - Apr 21 , 2026 | 11:41 AM