Share News

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం

ABN , Publish Date - Apr 21 , 2026 | 07:12 AM

భారత్‌లో డోపింగ్‌ సమస్య ఆందోళనకర స్థాయికి చేరింది. దీంతో ఇప్పటివరకు కేటగిరీ ‘బి’లో ఉన్న భారత్‌.. కేటగిరీ ‘ఎ’కి...

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం

కేటగిరి ‘ఎ’కి మార్పు

న్యూఢిల్లీ: భారత్‌లో డోపింగ్‌ సమస్య ఆందోళనకర స్థాయికి చేరింది. దీంతో ఇప్పటివరకు కేటగిరీ ‘బి’లో ఉన్న భారత్‌.. కేటగిరీ ‘ఎ’కి మారిందని అథ్లెటిక్స్‌ ఇంటెగ్రిటీ యూనిట్‌ (ఏఐయూ) తెలిపింది. ఈ కారణంగా దేశంలోని అథ్లెట్లు మరింత కఠినమైన డోపింగ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రష్యా, బెలారస్‌, ఇథియోపియా, కెన్యా, నైజీరియా, ఉక్రెయిన్‌లాంటి దేశాలు కేటగిరీ ‘ఎ’లో ఉన్నాయి. ‘భారత్‌లో అత్యధిక డోపింగ్‌ ఉల్లంఘనలు అథ్లెటిక్స్‌లోనే జరిగాయి. అలాగే దేశంలో డోపింగ్‌ నిరోధక కార్యక్రమం స్థాయికి తగినట్టుగా లేదు. నిషేధిత ఉత్ర్పేరకాలు, స్టెరాయిడ్ల ఉత్పత్తి అధికంగా ఉంటోంది’ అని ఏఐయూ చైర్మన్‌ డేవిడ్‌ హౌమన్‌ తెలిపాడు.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 07:12 AM