Share News

ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 10:42 AM

అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిల‌క్ వర్మ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
Tilak Varma

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిల‌క్ వర్మ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. న‌రేంద్ర మోదీ స్టేడియంలో తిల‌క్ పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జయసూర్య రికార్డును తిలక్ సమం చేశాడు.


జయసూర్య 2008లో చెన్నై సూపర్ కింగ్స్ పై 45 బంతుల్లోనే శతకం సాధించాడు. మళ్లీ18 ఏళ్ల తర్వాత తాజాగా హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడు మాత్రం తిలక్‌ వర్మనే కావడం విశేషం. అలానే ముంబై ఇండియన్స్‌ తరపున సెంచరీ చేసిన రెండవ అతి పిన్నవయష్కుడిగా తిలక్‌ అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ జాబితాలో కామోరూన్‌ గ్రీన్‌(22 ఏళ్ల 352 రోజులు) తొలిస్థానంలో ఉన్నాడు.


ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్

ఇక ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయే ఓ రికార్డును కూడా తిలక్ వర్మ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో లేదా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. గతంలో యూసఫ్ పఠాన్, మిల్లర్, స్టోక్స్ ఛేజింగ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలు చేశారు. నిన్నటి మ్యాచ్‌లో తిలక్ వర్మ తొలి 22 బంతుల్లో 19 పరుగులు చేసి.. ఆ తర్వాత23 బంతుల్లోనే 82 పరుగులతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పై 99 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించగా.. తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

హ్యాట్రిక్‌పై సన్‌రైజర్స్‌ గురి

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం

Updated Date - Apr 21 , 2026 | 10:53 AM