Share News

నోబాల్స్ తగ్గాలంటే.. టెస్టుల్లో ఫ్రీ హిట్ పెట్టాలి: టీమిండియా కోచ్

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:30 AM

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు నో బాల్స్ వేశాడు. ఈనేపథ్యంలో టెస్టుల్లో నోబాల్స్ సంఖ్య తగ్గాలంటే ఫ్రీ హిట్ నిబంధనను అమలు చేయాలని భారత స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అభిప్రాయపడ్డాడు.

నోబాల్స్ తగ్గాలంటే.. టెస్టుల్లో ఫ్రీ హిట్ పెట్టాలి: టీమిండియా కోచ్
Ravindra Jadeja no balls

స్పోర్ట్స్ డెస్క్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు నో బాల్స్ వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు నోబాల్స్ వేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒకటి వేశాడు. ఈనేపథ్యంలో టెస్టుల్లో నోబాల్స్ సంఖ్య తగ్గాలంటే ఫ్రీ హిట్ నిబంధనను అమలు చేయాలని భారత స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అభిప్రాయపడ్డాడు. జడేజా వేసిన నోబాల్స్‌పై స్పందిస్తూ సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.


నాలుగో రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులేను నోబాల్స్ గురించి మీడియా ప్రశ్నించింది. బహుతులే సమాధానం ఇస్తూ... ఫ్రీ హిట్ నిబంధనను తీసుకొస్తేనే బౌలర్లు దారిలోకి వస్తారంటూ సరద వ్యాఖ్యలు చేశాడు. నోబాల్ సమస్యను అధిగమించేందుకు వర్క్ చేస్తున్నామని తెలిపాడు. ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే క్రమంలో కొన్నిసార్లు బౌలర్లు లైన్ దాటుతారని చెప్పాడు. అయితే ఇది సాకు మాత్రం కాదని తెలిపాడు.


బౌలింగ్ ప్రారంభించే స్థానం గురించి జడేజా, సారాన్ష్ జైన్‌తో కలిసి వర్క్ చేశామని, కానీ కొన్నిసార్లు నిర్దిష్ట బంతి కోసం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టే సమయంలో ఓవర్ స్టెప్ అవుతున్నారని బహుతులే వెల్లడించాడు. ఈ సమస్యను వారు సరిదిద్దుకొని మెరుగవుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ సుదీర్ఘ ఫార్మట్‌లో ఫ్రీ హిట్ రూల్ వస్తే మాత్రం కచ్చితంగా నో బాల్స్ తగ్గిపోతాయని సాయిరాజ్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

గెలుపు ముంగిట..

ఆసియా చెస్‌ విజేతలు మయాంక్‌, ప్రతీతి

Updated Date - Aug 27 , 2026 | 08:06 AM