క్రమశిక్షణ చర్యలపై ఉదాసీనమా!
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:24 AM
క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న క్రికెటర్లపై చర్యలు తీసుకోవడంలో ఐసీసీ, బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తప్పుపట్టాడు.
ఐసీసీ, బీసీసీఐ వైఖరిపై మంజ్రేకర్
కొలంబో: క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న క్రికెటర్లపై చర్యలు తీసుకోవడంలో ఐసీసీ, బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తప్పుపట్టాడు. యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో గొడవలకు దిగిన ఉదంతాలను అతడు ప్రస్తావించాడు. విమర్శలు వెల్లువెత్తినా జైస్వాల్ తన ప్రవర్తనను సమర్థించుకోవడం గమనార్హం. ‘ఇటీవల శ్రీలంకలో భారత్ ‘ఎ’ పర్యటన సందర్భంగా వైభవ్, తాజాగా మొదటి టెస్ట్‌లో జైస్వాల్ ప్రత్యర్థులతో గొడవ పడ్డారు. అయితే ఐసీసీ, బీసీసీఐ చర్యలు చేపట్టలేదు. అలా చేయడమంటే.. వారిద్దరూ మళ్లీ అలాగే ప్రవర్తించేలా శిక్షణ ఇస్తున్నట్టే లెక్క. ఇది క్రికెట్‌తో పాటు ఆ క్రికెటర్ల భవిష్యత్‌కు మంచిది కాదు’ అని ఎక్స్‌లో మంజ్రేకర్ సూచించాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. తాను చదువుకున్న స్కూలే కారణమంటూ..