Share News

నా కెరీర్‌ నాశనం చేశారు

ABN , Publish Date - Aug 27 , 2026 | 05:08 AM

విల్‌ పకోవ్‌స్కీ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్‌. 28 ఏళ్ల అతడు 2021లో సిడ్నీలో భారత్‌పై ఆస్ట్రేలియా తరఫున ఒకే ఒక టెస్ట్‌ ఆడాడు. కేవలం 27 సంవత్సరాల వయస్సులో గత ఏడాది ఏప్రిల్‌లో ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.

నా కెరీర్‌ నాశనం చేశారు

చదివిన స్కూల్‌పై కోర్టుకెక్కిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

మెల్‌బోర్న్‌: విల్‌ పకోవ్‌స్కీ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్‌. 28 ఏళ్ల అతడు 2021లో సిడ్నీలో భారత్‌పై ఆస్ట్రేలియా తరఫున ఒకే ఒక టెస్ట్‌ ఆడాడు. కేవలం 27 సంవత్సరాల వయస్సులో గత ఏడాది ఏప్రిల్‌లో ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే తన కంకషన్‌ చరిత్ర కారణంగా వైద్యుల సలహా మేరకు క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్టు అప్పట్లో పకోవ్‌స్కీ ఆవేదనతో తెలిపాడు. వర్తమానంలోకి వస్తే.. తాను చదివిన స్థానిక బ్రైటన్‌ గ్రామర్‌ స్కూల్‌పై పకోవ్‌స్కీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2014లో..16 ఏళ్ల వయస్సులో ఫుట్‌బాల్‌ ట్రెయినింగ్‌ సెషన్‌లో విల్‌ తలకు దెబ్బ తగలగా అతడు స్ఫృహ కోల్పోయాడు. ఆ సందర్భంగా ప్రామాణిక కంకషన్‌ చర్యలు చేపట్టలేదని విల్‌ కోర్టు పిటిషన్‌లో ఆరోపించాడు. వీటివల్లే తన క్రికెట్‌ కెరీర్‌లో 13 సార్లు కంకషన్‌కు గురైనట్టు తెలిపాడు. దీంతో డాక్టర్ల సలహా మేరకు ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని చెప్పాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒలింపిక్స్‌- 2026కు సిద్ధమవుతున్న తెలంగాణ: సీఎం రేవంత్

వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్

Updated Date - Aug 27 , 2026 | 05:09 AM