Share News

ఒలింపిక్స్‌- 2026కు సిద్ధమవుతున్న తెలంగాణ: సీఎం రేవంత్

ABN , Publish Date - Aug 26 , 2026 | 08:42 PM

ఒలింపిక్స్‌- 2026కు తెలంగాణ సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఈ ఒలింపిక్స్‌కు అథ్లెట్లను సిద్ధం చేయడమే లక్ష్యమని అన్నారు.

ఒలింపిక్స్‌- 2026కు సిద్ధమవుతున్న తెలంగాణ: సీఎం రేవంత్
TG-CM-Revanth-Reddy

హైదరాబాద్‌, ఆగస్టు 26: ఒలింపిక్స్‌- 2026కు తెలంగాణ సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఈ ఒలింపిక్స్‌కు అథ్లెట్లను సిద్ధం చేయడమే లక్ష్యమని అన్నారు. ప్రపంచ స్థాయి క్రీడా ప్రతిభకు తెలంగాణ వేదిక అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ -KNSU మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడాకారులకు ప్రపంచస్థాయి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ సైన్స్‌, హైపెర్ఫార్మెన్స్‌పై భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. కొరియా స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌ను తెలంగాణకు తెస్తామన్నారు. యువ క్రీడాకారులకు కొత్త అవకాశాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వసంత కుమార్ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయి: సీఎం చంద్రబాబు భరోసా

జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: దేవినేని ఉమా

For TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 08:47 PM