Share News

వసంత కుమార్ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయి: సీఎం చంద్రబాబు భరోసా

ABN , Publish Date - Aug 26 , 2026 | 08:22 PM

చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు చెరుకూరి వసంత కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం వసంత కుమార్ కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

వసంత కుమార్ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటాయి: సీఎం చంద్రబాబు భరోసా
AP CM Chandrababu

అమరావతి,ఆగస్టు26: చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు చెరుకూరి వసంత కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం వసంత కుమార్ కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన వసంత కుమార్ సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు.


కుటుంబానికి పార్టీతోపాటు ప్రభుత్వం అండగా ఉంటాయని స్పష్టం చేశారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్బంగా వసంత కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 24వ తేదీన చెరుకూరి వసంత కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: దేవినేని ఉమా

చింతూరులో ఓఎస్డీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..

For AP News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 08:28 PM