చింతూరులో ఓఎస్డీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:52 PM
పోలవరం జిల్లాలోని చింతూరు పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. చింతూరు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఎదుట వీరు లొంగిపోయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
పోలవరం, ఆగస్టు 26: జిల్లాలోని చింతూరు పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. చింతూరు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఎదుట వీరు లొంగిపోయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారని తెలిపాయి. వీరి పేర్లు.. ముచ్చిక లక్ష్మి, కదిటి వెంక, కదిటి లక్షయ్య అని వివరించాయి. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పని చేస్తూ.. గతంలో పలు హింసాత్మక కర్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నాయి.
వీరి మీద పలు కేసులు కూడా నమోదయి ఉన్నాయని చెప్పాయి. హింసాయుత మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీరు ముందుకు వచ్చారని చింతూరు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస విధానాల అనుగుణంగా సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ తీసుకు వచ్చింది. దీంతో వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అలాగే పలువురు అరెస్టయ్యారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌లో భారీగా మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్.. మంచి ఫలితం ఇచ్చిందని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇతరులకు నీతులు చెప్పే ముందు చరిత్ర చూసుకోవాలి జగన్: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఉద్యోగానికి రాజీనామా చేసి.. బెజవాడ బయలుదేరిన భావన.. అంతలో..
For AP News And Telugu News