ఉద్యోగానికి రాజీనామా చేసి.. బెజవాడ బయలుదేరిన భావన.. అంతలో..
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:38 PM
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
కోదాడ, ఆగస్టు 26: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 23 సంవత్సరాల భావనా వర్ష కూడా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పని చేసిన ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు విజయవాడకు పయనమైంది. ఇందుకోసం మంగళవారం రాత్రి 11.00 గంటలకు విజయవాడ వెళ్లేందుకు హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సు ఎక్కింది.

ఉదయం 5.00 గంటలకు విజయవాడలో దిగిపోతామని భావన అనుకుంది. కానీ అంతలోనే ఆ బస్సు ప్రమాదానికి గురి కావడంతో మరణించింది. భావనా వర్ష మృతి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారంతా కోదాడకు హుటాహుటిన బయలుదేరారు. ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున 4.00 గంటలకు రహదారి పక్కన ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాటికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు.
బస్సు ప్రమాదంపై స్పందించిన ప్రధాని..
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర
తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’
For AP News And Telugu News