స్టార్క్ ... నెంబర్ వన్
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:06 AM
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా తన నెంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
బుమ్రా చేజారిన ‘టాప్’ ర్యాంకు
దుబాయ్: ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా తన నెంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా, బుమ్రా ఒక స్థానం దిగజారి ద్వితీయ, హెన్రీ (న్యూజిలాండ్) తృతీయ స్థానాల్లో నిలిచారు. బ్యాటర్ల జాబితాలో హ్యారీ బ్రూక్, జో రూట్, స్టీవ్ స్మిత్ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. రిషభ్ పంత్ ఏడో ర్యాంక్ దక్కించుకోగా, శుభ్‌మన్ గిల్ ఎనిమిదిలోనే ఉన్నాడు. యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్‌లో నిలిచి, టాప్-10 చోటు కోల్పోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, యాన్సెన్ (దక్షిణాఫ్రికా), మెహ్దీ హసన్ (బంగ్లాదేశ్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.