ఆసియా చెస్ విజేతలు మయాంక్, ప్రతీతి
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:36 AM
ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు.
ముంబై: ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్లాసికల్ ఆఖరి రౌండ్‌ను డ్రా చేసుకున్న మయాంక్ 7.5 పాయింట్లతో విజేతగా నిలవగా, ఆర్టిం పిన్‌జిన్ (రష్యా), భారత ఆటగాడు దక్ష్ గోయెల్ రజత, కాంస్యాలు సాధించారు. బాలికల క్లాసికల్ విభాగంలో ప్రతీతి కూడా ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించి 7.5 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా, మరియా ఖోల్యావ్‌కో (కజకిస్థాన్) రజతంతో, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్యంతో మెరిశారు. తెలుగు క్రీడాకారులు శరణ్య, అద్వైత్ వారి విభాగాల్లో ఆరో స్థానంతో నిరాశపర్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
27 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. తాను చదువుకున్న స్కూలే కారణమంటూ..
వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్