రెండు గ్రూపులుగా టీమిండియా కోచింగ్ స్టాఫ్.. హెడ్ కోచ్‌గా గంభీర్ కంటిన్యూ!
ABN , Publish Date - Nov 09 , 2026 | 12:04 PM
భారత జట్టు కోచింగ్ సిబ్బంది రెండుగా విడిపోనుంది. మూడో వన్డే అనంతరం ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయని సమచారం. వన్డే ప్రపంచకప్2027ను దృష్టిలో ఉంచుకుని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే వన్డే జట్టుతో పాటే మౌంట్ మాంగనూయికి వెళ్లనున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టు కోచింగ్ సిబ్బంది రెండుగా విడిపోనుంది. మూడో వన్డే అనంతరం ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయని సమచారం. వన్డే ప్రపంచకప్2027ను దృష్టిలో ఉంచుకుని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే వన్డే జట్టుతో పాటే మౌంట్ మాంగనూయికి వెళ్లనున్నారు. మిగిలిన రెండు వన్డేలకు వీరు ఇద్దరూ జట్టుకు మార్గదర్శనం చేయనున్నారు.
మరోవైపు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తదితర సిబ్బంది నవంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం నేరుగా వెల్లింగ్టన్కు పయనం కానున్నారు. అక్కడ టెస్ట్ జట్టు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ప్రీ సీరీస్ క్యాంప్‌లో వీరు భాగం కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సితాన్షు కోటక్ మూడో వన్డే ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో వెల్లడించారు. పరిస్థితులకు తగినట్లుగా ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే, వన్డే జట్టులోని ముగ్గురు ఫాస్ట్ బౌలర్లైన అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలను టెస్ట్ జట్టుకు రిజర్వ్ ఆటగాళ్లుగా న్యూజిలాండ్‌లోనే ఉంచాలని నిర్ణయించినట్లు కోటక్ తెలిపారు. న్యూజిలాండ్ పిచ్‌లపై లభిస్తున్న అదనపు బౌన్స్, సీమ్ మూవ్మెంట్, స్వింగ్ సుదీర్ఘ ఫార్మాట్‌కు సన్నద్ధమయ్యేందుకు బ్యాటర్లకు ఎంతో ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంప్ ద్వారా టెస్ట్ జట్టు మరింత పటిష్ఠంగా మారుతుందని కోటక్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ 'ఏ' ఆడిన మ్యాచ్‌లు కూడా అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సాయపడ్డాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
యూత్ ఒలింపిక్స్ 2026: ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం
వెస్టిండీస్ బ్యాటర్ కొత్త చరిత్ర.. బ్రావో రికార్డ్ బ్రేక్
గుర్నూర్ బ్రార్ బౌలింగ్ సీక్రెట్ ఇదే.. కివీస్ బ్యాటర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే..?