వెస్టిండీస్ బ్యాటర్ కొత్త చరిత్ర.. బ్రావో రికార్డ్ బ్రేక్
ABN , Publish Date - Nov 09 , 2026 | 06:58 AM
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాటర్ కేవెమ్ హాడ్జ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.189 బంతుల్లో17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 140 పరుగులు చేశాడు. ఈ క్రమంలో హాడ్జ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: సిల్హెట్ వేదికగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విండీస్ మిడిలార్డర్ బ్యాటర్ కేవెమ్ హాడ్జ్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. నాలుగో రోజు ఆటలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హాడ్జ్ తన సూపర్ బ్యాటింగ్‌తో కరేబియన్ జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. 189 బంతుల్లో17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 140 పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కేవెమ్ హాడ్జ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
బంగ్లా గడ్డపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వెస్టిండీస్ బ్యాటర్‌గా కేవెమ్ హాడ్జ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు డారెన్ బ్రావో పేరిట ఉండేది. 2012లో ఖుల్నా వేదికగా జరిగిన టెస్టులో డారెన్ బ్రావో 127 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో ఆల్‌టైమ్ రికార్డును హాడ్జ్ బ్రేక్ చేశాడు. అతడికి ఇది మూడో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. దీంతో 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 356 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 386 పరుగులు చేసింది.
టెస్టుల్లో బంగ్లాదేశ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన విండీస్ టాపార్డర్ బ్యాటర్లు:
కేవెమ్ హాడ్జ్-140* వర్సెస్ బంగ్లాదేశ్ (సిల్హెట్, 2026)
డారెన్ బ్రావో-127 వర్సెస్ బంగ్లాదేశ్ (ఖుల్నా, 2012)
కిర్క్ ఎడ్వర్డ్స్-121 వర్సెస్ బంగ్లాదేశ్ (మీర్పూర్, 2011)
రామ్‌నరేష్ సర్వాన్-119 వర్సెస్ బంగ్లాదేశ్ (ఢాకా)
కియారన్ పొవెల్- 117 వర్సెస్ బంగ్లాదేశ్ (మీర్పూర్, 2012)
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ఆసియా కప్: భారత్‌పై పాక్ విజయం
హార్దిక్ పాండ్య లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టం లేదు: ఆకాశ్ చోప్రా